Workshops for MLAs : జాతీయ విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మ్యాపింగ్ పై శాసన సభ్యులకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఏపీ సచివాలయంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేయనుంది.
జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా రాష్ట్రంలో పాఠశాలల మ్యాపింగ్, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు అంశాలపై ఎమ్మెల్యేలకు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,835 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలలను విద్యాశాఖ మ్యాపింగ్ చేసింది. పాఠశాలల విలీనం ద్వారా 2,03,454 మంది విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధన జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనిపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.