అమరావతినే ఏకైకా రాజధానిగా కొనసాగించాలంటూ మహిళలు చేపట్టిన ఆందోళనలు 82వ రోజుకు చేరుకున్నాయి. ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్న మహిళల పోరాట స్ఫూర్తిని అమరావతి మహిళా ఐకాస కొనియాడింది. కన్నీళ్లను దిగమింగి... కష్టాలను ఎదిరించి.. ఐదు కోట్ల ప్రజల కోసం ఉద్యమం చేస్తున్న రాజధాని మహిళలను సత్కరించుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి మహిళా ఐకాస ఆధ్వర్యంలో ఉద్యమ మహిళలను సన్మానించారు. వారి కష్టాలను తెలుసుకొని అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో స్థానిక ఎన్నికలను ఆపటం సరికాదన్నారు.
'ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదు' - capital women farmer latest news
కన్నీళ్లను దిగమింగి... కష్టాలను ఎదిరించి.. ఐదు కోట్ల ప్రజల కోసం ఉద్యమం చేస్తున్న రాజధాని మహిళలను అమరావతి మహిళా ఐకాస సత్కరించింది. ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదని రైతులు స్పష్టం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ రాజధాని మహిళలు చేపట్టిన ఆందోళనలను 82వ రోజూ కొనసాగించారు.
82వ రోజుకు చేరిన అమరావతి ఆందోళనలు