Ramoji Film City Women's day: మహిళామణుల్లోని అద్వితీయమైన స్ఫూర్తికి జేజేలు పలుకుతూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా... హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో మార్చి 7 నుంచి 13వ తేదీ వరకు మహిళా మహోత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. వారం రోజుల పాటు జరగనున్న వేడుకల్లో మహిళలు ఆనందోత్సాహాల్లో మునిగితేలేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల్లోని స్ఫూర్తికి, వారిలోని ప్రత్యేక ప్రతిభలకు వందనాలు పలుకుతూ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆహ్లాదకరమైన, వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు
విభిన్న పాత్రలను పోషించే మహిళామణులు ఆత్మవిశ్వాసం ప్రదర్శించేందుకు వీలుగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం టాలెంట్ కాంటెస్ట్‌లో గానం, నృత్యం, యాక్టింగ్, ర్యాంప్ వాక్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. పాటల చిత్రీకరణ అనుభవాన్ని ఆస్వాదిస్తూ, డీజే దివాతో కలిసి డ్యాన్స్, రంగోలి పోటీల్లో పాలుపంచుకొని తమలోని ప్రతిభను ప్రదర్శించి మరపురాని మధురానుభూతిని సొంతం చేసుకోవచ్చు.