ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎస్​కు మహిళా ఐఏఎస్​ల శుభాకాంక్షలు - news on apcs birthday

సీఎస్ నీలం సాహ్ని పుట్టినరోజు సందర్భంగా...మహిళా ఐఏఎస్ అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి ఆమె మెరుగైన సేవలు అందిస్తున్నారని మహిళా అధికారులు ప్రశంసించారు.

women ias officers wishes to apcs
సీఎస్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహిళా ఐఏఎస్ అధికారులు

By

Published : Jun 3, 2020, 9:08 AM IST

Updated : Jun 3, 2020, 9:24 AM IST

రాష్ట్ర ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళా ఐఏఎస్ అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎస్​ను కలిసిన పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు చెప్పారు. వివిధ విభాగాలకు చెందిన మహిళా ఐఏఎస్ అధికారులు బి.ఉదయలక్ష్మి, వి.ఉషారాణి, కె.సునీత, జి. వాణి మోహన్, రేఖా రాణి, కె.మాధవీలత, కె.విజయ... సీఎస్​ను కలిసి శుభాభినందనలు తెలిపారు. కీలకమైన ఏపీ రాష్ట్రానికి సీఎస్​గా నీలం సాహ్ని మెరుగైన సేవలందిస్తున్నారని మహిళా అధికారులు కొనియాడారు

Last Updated : Jun 3, 2020, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details