మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్.. తుకోగంజ్ పోలీసులు నిర్వహిస్తున్న ముస్కాన్ ఆపరేషన్లో రాష్ట్ర మహిళ ఆచూకీ లభించింది. నిస్సత్తువగా ఉన్న ఆమెను పోలీసులు చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో పోలీసులను పలువురు ప్రశంసిస్తున్నారు.
ఫోన్ నంబర్ సాయంతో..
తుకోగంజ్ రహదారి వెంట మహిళ యాచించడం గమనించిన పోలీసులు ఆమె గురించి ఆరా తీశారు. ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. తన తమ్ముడి ఫోన్ నంబర్ మాత్రం ఓ చీటీలో రాసుంది. ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇదీ చదవండి:విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యం: ఎంపీ రఘురామ