తెలంగాణలోని మేడ్చల్ జిల్లా నాచారం పరిధిలోని భవాని నగర్లో సాయిదర్శన అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్లో నివాసముంటున్న ఓ మహిళ... ఒకటి కాదు.. రెండు కాదు.. ఇరవై కుక్కల్ని పెంచుకుంటోంది. దీనితో అదే అపార్ట్మెంట్లో ఉంటున్న మిగత వారికి కుక్కలు చేస్తోన్న అరుపులు, మలవిసర్జనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు వాపోయారు.
కుక్కల బాధ భరించలేక పోలీస్స్టేషన్ మెట్లెక్కిన మహిళలు - మేడ్చల్ జిల్లా వార్తలు
కుక్కుల బాధ భరించలేకపోతున్నామంటూ మహిళలు పోలీస్స్టేషన్ మెట్లెక్కారు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కుక్కల బాధ భరించలేక పోలీస్స్టేషన్ మెట్లెక్కిన మహిళలు
ఈ విషయంపై సంబంధిత అధికారులకు తమ బాధ ఎన్నిసార్లు చెప్పుకున్న పట్టించుకోలేదని పేర్కొన్నారు. విసిగిపోయిన మహిళలు నాచారం పోలీస్స్టేషన్లో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుకున్నారు.