ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 1, 2021, 10:58 PM IST

ETV Bharat / city

ప్రకృతి విపత్తుల పేరిట యువతుల విరాళాలు.. రంగంలోకి పోలీసులు

గుంటూరు తరహాలో తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ పరిధిలో... ప్రకృతి విపత్తు బాధితుల పేరిట యువతులు విరాళాలు సేకరిస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిని దుషించినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని... విచారణ జరిపి బైండోవర్ కేసు నమోదు చేశారు.

ప్రకృతి విపత్తుల పేరిట యువతుల విరాళాలు
ప్రకృతి విపత్తుల పేరిట యువతుల విరాళాలు

ప్రకృతి విపత్తు బాధితుల పేరిట విరాళాలు వసూలు చేస్తున్న మహిళలను తెలంగాణలోని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పరిధిలోని కరీంగూడ రోడ్డులో కొందరు మహిళలు వాహనదారులను విరాళాలు అడుగుతున్నారు. వారి మాటలు నమ్మి కొందరు విరాళాలు ఇస్తున్నారు.

డబ్బులు ఇవ్వని వారిని యువతులు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. విరాళాలు సేకరించే సంస్థ పేరుగాని ఎవరికి వాటిని అందిస్తున్నారనే వివరాలు చెప్పకపోవటంతో వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సదరు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. వీరంతా గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చెందిన వారిగా గుర్తించి... బైండోవర్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:కాలేజ్ అమ్మాయిల్లా కనిపిస్తారు.. విరాళాల పేరుతో దండుకుంటారు!

ABOUT THE AUTHOR

...view details