తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామ సర్పంచ్ మంజుల భర్త సుధాకర్‌పై అదే గ్రామానికి చెందిన మహిళలు దాడి చేశారు. గతంలో వేరే మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో గ్రామంలో వైరల్ కావడంతో సంబంధిత మహిళలు గ్రామ పంచాయతీ ఆవరణలో దాడి చేశారు.
తెలంగాణ: సర్పంచ్ భర్త వేధింపులు... చితక్కొట్టిన మహిళలు - mahilala dhadi
గ్రామంలో ఓ మహిళతో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిన సర్పంచ్ భర్తపై గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళలు దాడి చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
attack on sarpanch husband
గతంలోని హన్మకొండ బస్టాండ్ ఏరియాలో ఓ లాడ్జిలో వ్యభిచారం చేస్తూ సర్పంచ్ భర్త సుధాకర్ పట్టుబడినట్లు స్థానికులు ఆరోపించారు. పెద్దవంగర ఎస్సై రియాజ్ పాషా రంగప్రవేశంతో సదరు మహిళకు బహిరంగ క్షమాపణ చెప్పించడంతో గొడవ సద్దుమణిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి:Chandrababu: గృహ నిర్మాణ రంగంపై సీఎం జగన్‌వి గాలి మాటలు: చంద్రబాబు