woman falls from moving bus: ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి... అదే బస్ కింద పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 21 రోజుల కిందట తెలంగాణలోని హైదరాబాద్ ఆఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.
చంచల్ గూడా జేకే టవర్స్ ప్రాంతానికి చెందిన సిరాజ్ బాను... మార్చి 1న ఇంటికి వస్తూ ఆర్టీసీ బస్సు ఎక్కారు. సిద్ది అంబర్ బజార్ వంతెన వద్ద... డ్రైవర్ సైదయ్య బస్సును ఆపాడు. సిరాజ్ బాను బస్సు దిగి.. రోడ్డు దాటేందుకు బస్సు ముందు నుంచే వెళ్తుండగా.. అది గమనించని డ్రైవర్ సైదయ్య ముందుకు నడిపాడు.