తనను ప్రేమించి.. మరో యువతిని పెళ్లి చేసుకోవడం ఏంటంటూ.. పెళ్లి బాజాలు మోగిన ఇంటి ముందు ఓ యువతి ధర్నాకు దిగింది. ఈ ఘటన హైదరాబాద్ హబ్సిగూడ డివిజన్లో జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన శ్రీకాంత్‌చారి.. రామంతాపూర్‌కు చెందిన లక్ష్మి(29) 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. శ్రీకాంత్‌చారి బుధవారం రోజున మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
'నన్ను ప్రేమించాడు.. ఆమెను పెళ్లాడాడు' - ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా తాజా వార్తలు
తనను ప్రేమించి.. మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ.. ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

ఒకరితో ప్రేమ మరొకరితో పెళ్లి
ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి.. శ్రీకాంత్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో మోసం చేసిన శ్రీకాంత్చారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధితురాలికి ఆదర్శ మహిళా సంఘం సభ్యులు మద్దతు తెలిపారు. లక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మహిళా సంఘాల నేతలు తెలిపారు. చివరకు ఈ ప్రేమ, పెళ్లి కథ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు చేరింది.
ఇవీ చదవండి: