Woman Halchal in Meerpet: హైదరాబాద్ కూకట్‌పల్లి సీఐ చంద్రయ్య తన బంధువు అంటూ ఓ మహిళ రోడ్డుపై హల్చల్ చేసింది. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో టీకేఆర్ కమాన్ వద్ద ఘటన జరిగింది. సదరు మహిళ ప్రయాణిస్తున్న కారును.. మరో కారులో ఉన్న వ్యక్తి ఢీ కొన్నాడు. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ వాగ్వాదానికి దిగి అతనిపై దాడికి పాల్పడింది. ఈ కారణంగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
తానూ ఓ సీఐ బంధువునని మీర్‌పేట్‌లో మహిళ హల్చల్ - Women Halchal in Meerpet
Woman Halchal in Meerpet: హైదరాబాద్.. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళ హంగామా సృష్టించింది. సదరు మహిళ ప్రయాణిస్తున్న కారును వేరొక కారు ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అతనిపై దాడికి దిగింది. అంతే కాకుండా తానూ ఓ సీఐ బంధువునని హల్చల్ చేసింది.
మహిళ హంగామా
మహిళ ప్రయాణిస్తున్న కారుపై పోలీసు అని రాసి ఉన్న స్టిక్కర్ ఉన్నట్టు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఇరువురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి: