ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: కరోనా పరీక్ష కేంద్రం ఎదుట మహిళ మృతి - Woman dies in front of corona test center

కరోనా నిర్ధరణ పరీక్ష కోసం వచ్చిన ఓ మహిళ పరీక్ష కేంద్రం ఎదుట కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ గ్రామంలో జరిగింది.

corona
corona

By

Published : May 18, 2021, 6:30 PM IST

తెలంగాణ రాష్ట్రం వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ గ్రామంలో విషాదం జరిగింది. కరోనా నిర్ధరణ కోసం వెళ్లిన చాగంటి లలిత (45) అనే మహిళ పరీక్ష కేంద్రం ఎదుటే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి బంధువులు మృతదేహాన్ని వారి ఇంటికి తీసుకుని వెళ్లారు.

చాగంటి లలిత భర్త మూడేళ్ల క్రితం మృతి చెందడంతో కడిపికొండ గ్రామంలో తన తల్లితో కలిసి ఉంటోంది. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. కరోనా లక్షణాలు కనిపించడంతో గ్రామంలో నిర్వహించే నిర్ధరణ పరీక్ష కోసం వెళ్లింది. పరీక్ష కేంద్రం వద్దకు చేరుకుని బయటే కుప్పకూలిపోయింది. ఆమెను పరీక్షించిన వైద్యుల మృతి చెందినట్లు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మంచంపై ఉంచి అంత్యక్రియలకు తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:విషాదం: నాలుగు రోజుల వ్యవధిలో తల్లి, కుమార్తె మృతి

ABOUT THE AUTHOR

...view details