ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆస్పత్రి మూత్రశాలలో ప్రసవం.. బిడ్డ మృతి.. వైద్యులు పట్టించుకోలేదని ఆవేదన

Delivery in Hospital Washroom : పురిటినొప్పులతో ఆసుత్రికి వెళ్లిన ఓ గర్భిణి బాత్​రూంలోనే ప్రసవించగా శిశువు మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం రోజున చోటుచేసుకుంది. రెండ్రోజులు ఆసుపత్రి చుట్టూ తిరిగినా.. వైద్యాధికారులు పట్టించుకోలేదని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ మాత్రం మరోవిధంగా ఉంది.

Delivery in Hospital Washroom
ఆస్పత్రి మూత్రశాలలో ప్రసవం

By

Published : Jun 3, 2022, 9:47 AM IST

Delivery in Hospital Washroom : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన లోకుర్తి మాధవిని మొదటి కాన్పు కోసం బుధవారం సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి, ప్రసవానికి ఇంకా 20 రోజుల గడువుందని వైద్యులు తెలిపారు. గురువారం నొప్పులు వస్తున్నాయని మాధవిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు.

ఆమె బాత్‌రూంలోకి వెళ్లగా అందులోనే ప్రసవం జరిగి, ఆడశిశువు జన్మించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను బయటకు తీసుకొచ్చి చికిత్స అందించారు. శిశువు బాత్‌రూంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజులు ఆసుపత్రి చుట్టూ తిరిగినా వైద్యాధికారులు పట్టించుకోలేదని బంధువులు మండిపడ్డారు.

ఇదే విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మురళీధర్‌రావును వివరణ కోరగా.. ప్రసవానికి ఇంకా 20 రోజుల సమయం ఉందని, కడుపులో శిశువు ఎదుగుదల సరిగా లేదని తెలిపారు. ఆపరేషన్‌ చేస్తే తల్లి ప్రాణానికి ప్రమాదమని, ముందు రోజే తాము చెప్పామన్నారు. గురువారం ఆసుపత్రిలో చేర్చుకోకముందే బాత్‌రూం కోసమని వెళ్లిన ఆమెకు అక్కడే ప్రసవం జరిగిందని, ఇందులో వైద్యుల తప్పిదం ఏమీ లేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details