హైదరాబాద్‌లో చిట్టీల పేరిట మహిళ నాలుగున్నర కోట్లకు టోకరా వేసింది. హయత్‌నగర్ పరిధిలోని ప్రగతి నగర్‌లో ఉంటున్న పూలమ్మ అనే మహిళ... చిట్టీలు, అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురి నుంచి డబ్బు వసూలు చేసింది. రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడం వల్ల హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సుమారు 70 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల టోకరా.. 70మందికి మహిళ మస్కా - Hayatnagar Woman cheating updates
చిట్టీల పేరుతో అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించిన ఓ మహిళ నాలుగున్నర కోట్లకు టోకరా వేసింది. ఈ ఘటన తెలంగాణలోని హయత్‌నగర్ పరిధిలో జరిగింది. 70 మంది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హయత్‌నగర్ మహిళ ఫ్రాడ్