మహిళపై అత్యాచారం.. మారేడుపల్లి సీఐ సస్పెండ్..! - ఇన్‌స్పెక్టర్‌పై కిడ్నాప్ కేసు
Woman accuses Inspector of rape : తన భర్తపై దాడి చేసి.. తనను అపహరించి ఇన్స్పెక్టర్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫిర్యాదు చేసింది. స్పందించిన వనస్థలిపురం పోలీసులు ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేసుకున్నారు.
మారేడుపల్లి సీఐ సస్పెండ్
Woman accuses Inspector of rape : హైదరాబాద్ మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్‌రావుపై అత్యాచారం కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వనస్థలీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నాగేశ్వర్‌రావు ఓ వివాహితను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన భర్తపైనా దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. వనస్థలీపురం పోలీసులు సీఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు. నాగేశ్వర్‌రావును వనస్థలీపురం పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.