‘మా పార్టీ నుంచి బరిలోకి దిగిన 17 డివిజన్ల అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు ఉపసంహరణ రోజు చిత్తూరులోనే లేరు. వారి పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి ఉపసంహరణ పత్రాలు ఇచ్చారు. 48వ డివిజన్ నుంచి పోటీ చేసిన రతీదేవి, ఆమె భర్త ఈశ్వర్ కంచిలో ఉన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరచిన వెంకటేశ్ బుధవారం తమిళనాడులోని సేలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను ఆసుపత్రిలో ఉన్నట్లు వెంకటేశ్ వీడియో కాల్ ద్వారా ఆర్వోకు తెలియజేశారు. ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నారు. అయినా బుధవారం సాయంత్రం వెంకటేశ్ సంతకం చేసి.. నామినేషన్ వెనక్కి తీసుకున్నాడని ఆర్వో ప్రకటించారు. 21వ డివిజన్‌కు చెందిన తెదేపా అభ్యర్థి లక్ష్మీపతి.. ఉపసంహరణ సమయంలో తిరుమలలో ఉన్నారు. ఆయన నామినేషన్ వెనక్కి తీసుకున్నట్లు ఆర్వో ప్రకటించారు’ - అనంతరం ఎమ్మెల్సీ దొరబాబు
అభ్యర్థుల్లేకుండా ఉపసంహరణా? - ఏపీ తాజా వర్తలు
అక్రమ ఉపసంహరణలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు అనంతరం ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడారు. చిత్తూరు కార్పొరేషన్‌లో వైకాపా 50 డివిజన్లకు 37 అక్రమంగా ఏకగ్రీవం చేసుకుందన్నారు.
Withdrawal
ఇదీ చదవండి:నిరసనలు కొనసాగుతున్నా.. అమ్మకానికి అడుగులు !