రాష్ట్రంలో పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
మధ్యాహ్నం గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనుంది. మంగళవారం ప్రారంభమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న ఒక్క రోజు 221 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.