పురపాలిక ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తైంది. నగర, పురపాలికల్లోని ... డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళ, బుధవారం రెండు రోజుల గడువు ఇచ్చింది. తొలిరోజు 2వేల 472మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ మధ్యాహ్నం 3గంటల వరకు గడువులోగా వివిధ పురపాలికల్లోనూ అభ్యర్థులు తమ నామినేషన్లు వెనక్కుతీసుకున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక సంఘం.... వైకాపా సొంతమైంది. ఇక్కడి 31 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. ప్రత్యర్థుల నామినేషన్ లు లేకపోవటంతో పుంగనూరు పురపాలక సంఘం వైకాపాకి ఏకగ్రీవమైంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో నాటకీయ పరిణామలు చోటుచేసుకున్నాయి. 8 వార్డులో వైకాపా, తెలుగుదేశం అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఇక్కడ ఎన్నిక లేనట్లేనని చెబుతున్నారు. మార్కాపురం పురపాలక సంఘంలోని 35 వార్డుల్లో 4 ఏకగ్రీవాలయ్యాయి. ఈ నాలుగు వార్డులుకు వైకాపాకు సొంతమయ్యాయి. కృష్ణ జిల్లా నందిగామ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు గాను 55 మంది బరిలో నిలిచారు.