మూడు రోజులు వర్షం పడితేనే భాగ్యనగరం(greater hyderabad) అల్లాడిపోతోంది. అదే ఏకధాటిగా 17 రోజుల పాటు 440.35 మిల్లీమీటర్ల వర్షపాతం సంభవిస్తే, ఇక అంతే సంగతులు.. అవును వాతావరణంలోని మార్పులు భాగ్యనగరానికి శాపంగా పరిణమించనున్నాయి. వరుణుడు ప్రతాపం చూపిస్తే(rains in hyderabad).. సుమారు 625 చదరపు కి.మీ.లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూభాగంలో సగభాగం అంటే 334 చదరపు కి.మీ. మునిగిపోవడం ఖాయం.. వరద ముంపు ప్రాంతాల్లో 38 శాతం భవనాలకు ముప్ఫే. వాతావరణ పరిస్థితులు(weather conditions) ప్రమాదకరంగా మారినప్పుడు సగం నగరం మునిగిపోతుందని బిట్స్ పిలానీ(Bits Pilani researchers)కి చెందిన సివిల్ ఇంజినీరింగ్ విభాగం పరిశోధకులు ఆర్.మాధురి, వై.ఎస్..ఎల్.శరత్ రాజా, కె.శ్రీనివాసరాజు, బి.సాయిపునీత్, కె.మనోజ్ తమ అధ్యయనంలో వెల్లడించారు. 'వాతావరణ మార్పు ఫ్రేమ్‌వర్క్‌లోని హైడ్రోలాజికల్ ఇంజినీరింగ్ సెంటర్ రివర్ అనాలిసిస్ సిస్టమ్ 2డీ మోడల్‌ను ఉపయోగించి పట్టణ వరద ప్రమాద విశ్లేషణ' అధ్యయనంలో దీన్ని వెల్లడించారు. అధ్యయనం 'హెచ్2ఓపెన్ జర్నల్(H2Open Journal)లో ప్రచురితమైంది.
ఏయే ప్రాంతాలంటే..
ఎక్కువగా వరదలకు గురయ్యే ప్రాంతాల్లో 1, 2, 4 జోన్లు ఉన్నాయి. ఎల్బీనగర్(LBnagar), చార్మినార్(charminar) జోన్, కూకట్‌పల్లి(kukatpally), అల్వాల్(alwal) ఉన్నాయి. నీటి కాల్వల ఆక్రమణల కారణంగా ముంపు ప్రాంతం పెరుగుతోంది. నీటి నిల్వ ప్రాంతాల్లో భూ ఆక్రమణలు 1995లో 55% ఉండగా, 2016 నాటికి 73%, 2050 నాటికి 85%కి పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడించారు.