Wings India Aviation Show: వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో-2022 అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు జరగనుంది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొదటిరోజు బీ2బీ మీటింగ్స్‌లో భాగంగా ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భారత విమానయాన రంగంతో తమ భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు.
రెండేళ్లు కఠిన సవాళ్లు
కరోనా వల్ల గడిచిన రెండేళ్లు పౌర విమానయాన రంగం కఠినమైన సవాళ్లు ఎదుర్కొందని విమానయాన రంగ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం మరల ఇంధన, ప్రాపంచిక ఒత్తిడి పరిస్థితులతో ఏవియేషన్ మార్కెట్ మరింత ప్రభావితమవుతోందని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడ్డారు. భారత్ తమకు కీలక వ్యాపార భాగస్వామి అని .. రాబోయే ఇరవై ఏళ్లలో 2210 విమానాలను భారత్‌కు అందజేస్తామని ఎయిర్ బస్ ప్రకటించింది.