Wings India 2022 : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వేదికగా విహంగ విమానాల ప్రదర్శన మరోసారి కనువిందు చేయనుంది. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. పౌరవిమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏవియేషన్ షో లాంఛనంగా ప్రారంభం కానుంది. దేశవిదేశాలకు చెందిన విమానాల ప్రదర్శనతో పాటు, వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు, పాలసీ తీర్మానాలు, రీజినల్ కనెక్టివిటీపై సదస్సులు, ఎయిర్ షో విన్యాసాలు ఈ ఏవియేషన్‌లో భాగంగా జరగనున్నాయి.
2 రోజులు సాధారణ ప్రజలకు అనుమతి
కొవిడ్ కారణంగా గతేడాది కేవలం బిజినెస్ మీట్‌కే పరిమితమైన ఈ షో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు పూర్తి స్థాయిలో సందడి చేయనుంది. వింగ్స్ ఇండియా ఏవియేషన్-2022లో భాగంగా తొలి రెండు రోజులు వ్యాపార కార్యకలాపాల కోసం పరిమితం చేయగా.. చివరి రెండు రోజులు సాధారణ ప్రజలకు అనుమతిస్తారు. ఈసారి సమ్మిట్ ప్రధానంగా హెలికాప్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఎంఆర్వో పాలసీ, ఫ్లైయింగ్ ట్రాకింగ్ ఆర్గనైజేషన్ పాలసీలపై ఫోకస్ చేయనుంది. ప్రదర్శన చివరి రోజు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏవియేషన్ కంపెనీలు, సంస్థలకు అవార్డులను అందజేయనున్నారు.
ఇదీ చదవండి:visakha steel: విశాఖ ఉక్కుపై గళమెత్తిన ఎంపీలు.. ప్రైవేటీకరణే ఉత్తమమన్న కేంద్రం