రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద మందుబాబుల బారులు తీరారు. పెరిగిన మద్యం ధర అప్‌డేట్ కాకపోవడంతో అమ్మకాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మద్యం దుకాణాల వద్ద గందరగోళంతో మందుబాబులను పోలీసులు వరుసల్లో నిలబెడుతున్నారు. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని పోలీసులు చెబుతున్నారు.
తెరుచుకున్న మద్యం షాపులు.. బారులు తీరిన మందుబాబులు - ఏపీ మందు బాబుల బారులు
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి. మద్యం షాపుల వద్ద మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ మద్యం కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల నూతన ధరలు అప్‌డేట్ కాకపోవటంతో అమ్మకాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
తెరుచుకున్న మద్యం షాపులు.. బారులు తీరిన మందుబాబులు
లాక్డౌన్ వల్ల నెలన్నర రోజులుగా మద్యం షాపులు తెరుచుకోలేదు. కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ సండలింపులతో .. రాష్ట్రం ప్రభుత్వం ఇవాళ నుంచి మద్యం దుకాణాలు తిరిగి తెరిచింది. నెల్లన్నర తర్వాత దొరికిన మద్యానికి మందుప్రియులు పూజలు చేసి, హారతి పడుతున్నారు.
ఇదీ చదవండి :వైద్యం చేస్తున్నారా.. జాగ్రత్తలు తీసుకోండి
Last Updated : May 4, 2020, 4:00 PM IST