ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం షాపుల పర్యవేక్షణకు కంట్రోల్​ రూమ్​లు - మద్యం షాపుల పర్యవేక్షణకు కంట్రోల్ రూములు వార్తలు

మద్యం షాపుల పర్యవేక్షణకు జిల్లాల వారీగా కంట్రోల్​ రూమ్​లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లు, జేసీలను ఆబ్కారీశాఖ కమిషనర్ వివేక్​ యాదవ్ ఆదేశించారు. మద్యం దుకాణాల వద్ద రద్దీ దృష్ట్యా భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దుకాణం వద్ద 20 మంది కంటే ఎక్కువగా ఉంటే టోకెన్ల విధానం అమలు చేయాలని తెలిపారు.

మద్యం షాపుల పర్యవేక్షణకు కంట్రోల్​ రూమ్​లు ఏర్పాటు
మద్యం షాపుల పర్యవేక్షణకు కంట్రోల్​ రూమ్​లు ఏర్పాటు

By

Published : May 5, 2020, 1:27 PM IST

మద్యం షాపుల పర్యవేక్షణకు జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆబ్కారీశాఖ కమిషనర్‌ వివేక్​ యాదవ్ తెలిపారు. కలెక్టర్లు, జేసీలు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలన్నారు. దుకాణం వద్ద 20 మంది కంటే ఎక్కువగా వస్తే టోకెన్ల విధానం అమలు చేయాలని చెప్పారు.

టోకెన్లపై మద్యం విక్రయించే సమయం సూచించాలని వివేక్ యాదవ్‌ చెప్పారు. క్యూలైన్ల నియంత్రణకు గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలన్న ఆయన.. మద్యం దుకాణాల్లోని సూపర్​ వైజర్లు, సేల్స్ మెన్​కు ఎన్95 మాస్కులు, చేతి తొడుగులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.

ABOUT THE AUTHOR

...view details