మాన్సాస్ ట్రస్టు (Mansas Trust) అంశంలో హైకోర్టు (ap high court) తీర్పుపై అప్పీలుకు వెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు (minister vellampalli srinivasa rao) తెలిపారు. హైకోర్టు తీర్పును పరిశీలించి ముందుకు వెళ్తామన్నారు. అప్పీల్లో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (cm ys jagan) ను కలిసిన మంత్రి.. పలు అంశాలపై చర్చించారు. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన పలు అంశాలను వివరించారు.
అనుబంధ కథనం:మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్.. సంచయిత గజపతిరాజు నియామక జీవో రద్దు