తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన నారాయణ... ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగి. నగరానికి చెందిన శిరీష నారాయణకు దగ్గరి బంధువు. శిరీషకు గతంలో పెళ్లి కాగా... వ్యక్తిగత కారణాలతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. వరుసకు బావయ్యే నారాయణను రెండో పెళ్లి చేసుకుంది. నారాయణకు సైతం ఇది రెండో పెళ్లి. వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే పోలీసు కానిస్టేబుల్ కుమారుడు ఫణీంద్రప్రసాద్తో శిరీషకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
10 గంటలు శవంతో జాగారం....
భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసిన భర్త..సాయి ప్రియ నగర్‌కు మకాం మార్చాడు. అయినా భర్తకు అనుమానం రాకుండా ప్రియుడితో తన సంబంధాన్ని కొనసాగించింది. అనుమానంతో నారాయణ ప్రతీసారి ఆరా తీయటం వల్ల... భర్త అడ్డు తొలిగించుకోవాలని శిరీష నిర్ణయించుకుంది. అనారోగ్యంతో ఈనెల 26న ఇంట్లో నిద్రిస్తున్న నారాయణను ప్రియుడితో కలిసి హతమార్చింది. కత్తితో పొడిచి గొంతు కోసి కిరాతకంగా చంపేసింది. అనంతరం భర్త శవాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కి... 10 గంటల పాటు స్నానాల గదిలో ఉంచారు. అర్ధరాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో ఫణీంద్ర ప్రసాద్, అతని సోదరుడు మహేంద్ర ప్రసాద్ సహకారంతో శవాన్ని మోపాల్ మండలం మంచిప్ప అటవీ ప్రాంతంలోని ఓ గుంతలో పారేశారు.