ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Murder: ప్రియుడి మోజులో భర్తను చంపేసింది.. - bhadradri kothagudem district crime news

ప్రియుడి మోజులో పడి.. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తనే చంపేసింది. మృతదేహాన్ని ఇసుకలో పూడ్చిపెట్టి ఏమి తెలియనట్టు కూర్చుంది. బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయం బయటపడింది. ఈఘటన తెలంగాణ భద్రాద్రికొత్తగూడెంలో చోటుచేసుకుంది.

Murder: ప్రియుడి మోజులో భర్తను చంపేసింది..
Murder: ప్రియుడి మోజులో భర్తను చంపేసింది..

By

Published : Jun 18, 2021, 2:58 AM IST

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిమండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి.. భర్తను హత్యచేసింది. జిల్లాలోని పానుగోతు తండాకు చెందిన అజ్మీరరాము, లలిత దంపతులు. వీరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. రాము కూలి పనులు చేసుకుంటూ.. జీవనం సాగించేవాడు. అదే తండాలో కృష్ణ గొర్రెల వ్యాపారి. ఈ క్రమంలో వీరిద్దరికి స్నేహం ఏర్పడింది. భర్త లేని సమయంలో కృష్ణ, లలితలకు వివాహేతర సంబంధం కొనసాగించేవారు. విషయం తెలుసుకున్న అజ్మీరరాము, లలితల మధ్య గొడవలు జరిగాయి. దీనితో భర్తను ఖతం చేసేందుకు పన్నాగం వేశారు. అనుకున్నట్లే భర్తను చంపిన లలిత... బూర్గంపాడు మండల పరిధిలోని గొమ్మురు ఇసుక ర్యాంపులో పూడ్చివేశారు.

ఈ నేపథ్యంలో మృతుని బంధువులు టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు. గురువారం ఉదయం మృతదేహాన్ని రెడ్డిపాలెం గోదావరి ఇసుకలో కనుగొన్నారు. కేవలం ఎముకలు, దుస్తులు మాత్రమే ఉన్నాయి. మృతుని బంధువులు మృతదేహాన్ని గుర్తించారు. డీఎన్​ఏ టెస్టు నిర్వహించగా.. అది అజ్మీరరాముగా తేలింది. సీఐ రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details