తెలంగాణ రాష్ట్రం జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నివసించే సంజీవరెడ్డి(70) ఓ మహిళను(38)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు(17) ఉన్నారు. సంజీవరెడ్డి ప్రశాసన్‌నగర్‌లో ఆమె పేరిట ఓ ఇంటిని కొనుగోలు చేశారు. తరువాత ఆ మహిళ మరొకరిని వివాహం చేసుకొంది. తండ్రి, కుమారులిద్దరూ నందగిరిహిల్స్‌లో నివసిస్తున్నారు.
'ప్రశాసన్‌నగర్‌లో కొనుగోలు చేసిన ఇంటి పత్రాల కోసం గత నెల 31న ఆ మహిళ సంజీవరెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించింది. తన పేరిట ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వాలంటూ పట్టుబట్టింది. సంజీవరెడ్డిని దుర్భాషలాడింది. అంతటితో ఆగకుండా తనకు కొవిడ్ పాజిటివ్ ఉందని, ముఖంపై దగ్గి అంటిస్తానని బెదిరించింది. పలు విధాలుగా బెదిరింపులకు పాల్పడిందని..బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.