ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Accident: భర్త ఒడిలో భార్య తుదిశ్వాస... రెప్పపాటు కాలంలో అంతా..! - Abdullapurmet Accident

Abdullapurmet Accident: ఓ కారు అతివేగంగా దూసుకెళ్తోంది. ముందున్న ఓ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. రెప్పపాటులోనే జరిగిన ఈ ఘటనలో.. ద్విచక్రవాహనంపైనున్న భార్యాభర్తలు రోడ్డుపై పడిపోగా.. ఒళ్లంతా తీవ్రగాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఘటనతో షాక్​లో ఉన్న భర్త తేరుకుని చూడగా.. దూరంగా ఒళ్లంతా గాయాలతో పడి ఉన్న భార్య కనిపించింది. భార్యను కాపాడుకోవాలనే తాపత్రయంతో గాయాలతోనే ఆమె వద్దకు చేరి ఒడిలోకి తీసుకుని జయమ్మా.. జయమ్మా.. అని అంటుండగానే.. ఆమె కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని హైదరాబాద్​ శివారు అబ్దుల్లాపూర్​మెట్​లో జరిగింది.

Accident
భర్త ఒడిలో భార్య తుదిశ్వాస

By

Published : May 7, 2022, 2:15 PM IST

Abdullahpurmet Accident : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌కి చెందిన గంగనమోని శ్రీనివాస్‌.. తన భార్య జయమ్మతో కలిసి ద్విచక్రవాహనంపై బండరావిరాలకు బయలుదేరారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మీదుగా కవాడిపల్లి గ్రామ ముఖద్వారం వద్దకు చేరుకుంటుండగా.. వెనుక నుంచి మెరుపువేగంతో వచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది. చూస్తుండగానే ద్విచక్రవాహనం అదుపు తప్పడం.. శ్రీనివాస్​, జయమ్మ రోడ్డుపై పడిపోవటం.. గాయాలు కావటం.. ఒళ్లంతా రక్తమయవటం జరిగిపోయాయి.

Abdullahpurmet Accident Today : జరిగిన ఘటనతో.. ఒక్క నిమిషం ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉండిపోయాడు శ్రీనివాస్​. కళ్ల ముందు రక్తమోడుతున్న భార్య జయమ్మను చూడగానే.. ఒక్కసారిగా తేరుకున్నాడు. ఎలాగైనా భార్యను కాపాడుకోవాలని ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు. "జయమ్మా.. జయమ్మా.. కళ్లు తెరువు.. ఏం కాలేదు.. ఏం కాదు.. నన్ను చూడు.." అంటూ గద్గద స్వరంతో పిలుస్తూనే.. స్పృహ కోల్పోకుండా ఉండేందుకు కుదుపుతున్నాడు. ఈ క్రమంలో.. శ్రీనివాస్​ ఒళ్లోనే జయమ్మ తుది శ్వాస విడిచింది. చూస్తుండగానే.. తన చేతుల్లోనే భార్య ప్రాణాలు పోవటంతో శ్రీనివాస్​ బోరుమన్నాడు. అక్కడే ఉన్న స్థానికులు శ్రీనివాస్‌ను వనస్థలిపురం ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్రమాదానికి కారణమైన కారు.. కొంత దూరం అలాగే దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి వెళ్లి ఆగిపోయింది. కారు డ్రైవరు పరారయ్యాడు. కారులో తినుబండారాలు, ఖాళీ మద్యం సీసా, గ్లాసులు కనిపించాయి. వీటన్నింటిని బట్టి.. డ్రైవర్​ మద్యం మత్తులోనే వాహనం నడిపి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details