Wife Complaint on Husband : పెద్దలు కుదిర్చిన వివాహం. భార్యాభర్తలిద్దరూ అమెరికాలోని ఐటీ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారు. ఇటీవల భార్య తిరిగొచ్చి భర్తపై హైదరాబాదలోని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 ఏళ్ల దాంపత్య జీవితం తరువాత ఆమె భర్తపై ఫిర్యాదు చేయటం చర్చనీయాంశమైంది. పెళ్లయిన మొదటి రోజు నుంచి భర్త ద్వారా ఎదురైన మనోవేదన మౌనంగా భరించింది. పిల్లలు పుట్టాక అలవాటుగా మార్చుకుంది. ఇద్దరు బిడ్డలు ఉన్నత చదువులు పూర్తిచేసి.. పెళ్లిళ్లు చేశాక.. అప్పటి వరకూ అనుభవించిన నరకం నుంచి బయటపడాలనే నిర్ణయానికి వచ్చింది.
కేసు నమోదు చేసిన పోలీసులు ఆలుమగలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటికి కానీ భర్తకు తాను భార్యను హింసించానని తెలుసుకోలేకపోయారు. తనపై భార్య ఫిర్యాదు చేయడాన్ని నమ్మలేకపోయారు. ఒక్కఛాన్స్ ఇస్తే మారతానంటూ జీవిత భాగస్వామిని వేడుకున్నారు. ఆమె ఇక భరించలేను.. ఒంటరిగానే ఉంటానంటూ తెగేసి చెప్పారు.