ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తాగుబోతు భర్తకు.. నడి వీధిలో తకిట తధిమి' - telangana news

భార్య దేన్నయినా భరిస్తుంది అనుకోవడం పొరపాటు. ఏదైనా ఓపిక పట్టినంత కాలమే. తాగొచ్చి వేధిస్తున్న భర్తలో మార్పు వస్తుందేమోనని ఎదురుచూసింది. కానీ ఫలితం లేదని భావించిన ఆ ఇల్లాలు.. బజార్​లోకి లాక్కొచ్చి కట్టేసి చితక బాదింది.

wife beat drunken husband in imampur village circle
'తాగుబోతు భర్తకు నడి వీధిలో తకిట తధిమి'

By

Published : Dec 29, 2020, 4:36 PM IST

'తాగుబోతు భర్తకు నడి వీధిలో తకిట తధిమి'

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇమాంపూర్‌ గ్రామానికి చెందిన యాదగిరికి, అదే గ్రామానికి చెందిన కనకవ్వతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా యాదగిరి రోజూ తాగి ఇంటికొస్తున్నాడు. మద్యం మత్తులో భార్యాపిల్లల్ని తిడుతూ, కొడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.

ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు జరిగాయి. పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చినా అతడిలో మార్పు రాలేదు. విసుగు చెందిన కనకవ్వ సోమవారం భర్తను గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చింది. అక్కడ జెండా కర్రకు కట్టేసి కొట్టింది. గ్రామస్థులు ఆమెకు సర్దిచెప్పి, కట్లువిప్పడంతో అతను బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరుగెత్తాడు.

ఇదీ చూడండి:ఎండు చేపల తయారీనే జీవనోపాధిగా...

ABOUT THE AUTHOR

...view details