హైదరాబాద్ జియాగూడకు చెందిన ఎం.బి. రఘునాథ్ గోనెసంచుల వ్యాపారి. ఇతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. ఐదు రోజుల కిందట రాత్రి 8 గంటల సమయంలో తనపై భార్య, పిల్లలు, అత్త దాడికి దిగినట్లు పీఎస్లో ఫిర్యాదు చేశాడు. ఇనుపరాడ్లతో కొట్టి, కళ్లలో కారం వేసి దాడి చేసినట్లు వివరించాడు.
కళ్లలో కారం కొట్టి.. ఇనుపరాడ్లతో పిల్లలతో కలిసి.. భర్తపై దాడి! - wife attack on husband at kulsumpura
ఓ వ్యక్తి తన భార్య, కూతుళ్లు, కొడుకు, అత్త అందరూ కలిసి ఇనుపరాడ్లతో దాడి చేసిన ఘటన హైదరాబాద్ కుల్సుంపురా పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..?
![కళ్లలో కారం కొట్టి.. ఇనుపరాడ్లతో పిల్లలతో కలిసి.. భర్తపై దాడి! wife attack on husband at kulsumpura hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10505911-897-10505911-1612500159149.jpg)
తెలంగాణ: కళ్లలో కారం కొట్టి.. ఇనుపరాడ్లతో పిల్లలతో కలిసి భర్తపై దాడి
ఆస్తి కోసమే తనపై దాడి చేసినట్లు తెలిపాడు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. కాగా బాధితుడిని చికిత్స నిమిత్తం పోలీసులు... ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.