Couple died in Kamareddy: గుండెపోటు వచ్చి భర్త చనిపోగా.. అతని మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా హఠాన్మరణానికి గురై మృతి చెందిన ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. లింగంపేట్ మండలం షెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన పెండా రాజయ్య(61), లచ్చవ్వ(54) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం రాజయ్య ఛాతిలో నొప్పి వస్తుందని కుమారులకు చెప్పాడు.
మరణంలోనూ వీడని బంధం, భర్త మరణ వార్త విని భార్య మృతి - గుండెపోటుతో భార్యాభర్తలు మృతి
Couple died in Kamareddy ఎప్పుడో 40 ఏళ్ల కింద ఒక్కటయ్యారు. అప్పటినుంచి ఒకరికొకరు తోడుగా నిలిచారు. పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. అవసాన దశలో ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తున్నారు. ఇంతలో భర్త గుండెపోటుతో మరణించగా కట్టుకున్నవాడు చనిపోయిన కొన్ని గంటల్లోనే భార్య కూడా మరణించింది. మృత్యువులోనూ వీరి బంధం వీడలేదు. ఈ విషాదకరమైన ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగింది.
వెంటనే కుమారులు తండ్రిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటుకు గురై ద్విచక్రవాహనంపైనే ప్రాణాలు విడిచారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా భార్య లచ్చవ్వ గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో అప్పటివరకు అన్యోన్యంగా కలిసి జీవించిన దంపతులు ఒకేసారి ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవడంతో పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. భార్యాభర్తల మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
ఇవీ చదవండి: