ఎస్సీ యువకుడు ఓం ప్రతాప్ విషయంలో ప్రభుత్వం ఘోర తప్పిదం చేసిందని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. దర్యాప్తు చేయకుండా రహస్యంగా శవాన్ని ఖననం చేయడం పెద్ద తప్పు అని స్పష్టం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఎందుకు వెనక్కు తగ్గారు..? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ఎందుకు చేయలేదని నిలదీశారు. ప్రతాప్ ఫోన్ తీసుకున్న పోలీసు అధికారిపై విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. మృతుని కుటుంబసభ్యుల సంతకాలు తెల్ల కాగితంపై తీసుకున్నదెవరని నిలదీశారు. ఓం ప్రతాప్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.