ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sai Dharam Tej accident: వారే సాయిధరమ్​ను కాపాడారు..! - సాయి ధరమ్​ తేజ్​ ప్రమాదం గురించి 100 ఫోన్​ చేసిందెవరు

ఈనెల 10న హైదరాబాద్​లోని కేబుల్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్​ హీరో సాయిధరమ్ తీవ్రంగా గాయపడ్డాడు. వంతెనపై స్పోర్ట్స్​ బైక్​పై వెళ్తున్న క్రమంలో జారిపడ్డాడు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల సమయస్ఫూర్తితో.. గాయపడిన సాయిధరమ్​ తేజ్​ను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే..!

సాయిధరమ్ తేజ్​
Sai Dharam Tej accident

By

Published : Sep 12, 2021, 10:26 AM IST

Updated : Sep 12, 2021, 11:35 AM IST

ఒక్కసారిగా ద్విచక్రవాహనం అదుపు తప్పి జారుకుంటూ వచ్చింది.. దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి కింద పడి పల్టీలు కొట్టాడు.. ఆయన ఎవరో తెలీని పరిస్థితి.. సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడినపుడు పక్క నుంచి వెళ్తున్న అబ్దుల్‌ అనే వ్యక్తి ఒక పౌరుడిగా తన బాధ్యతను నిర్వర్తించారు. వెంటనే డయల్‌ 100కు, ఆ తర్వాత 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించడంలో సహకారం అందించడమేకాక ఆసుపత్రి వరకూ వెంట ఉన్నారు.

సకాలంలో స్పందించి..

అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన అబ్దుల్‌ సీఎంఆర్‌ సంస్థలో వ్యాలెట్‌ పార్కింగ్‌లో ఉద్యోగం చేస్తుంటారు. ఆయనకు నిజాంపేటలో పని ఉండడంతో జూబ్లీహిల్స్‌, వేలాడే వంతెన మీదుగా హైటెక్‌ సిటీ, జేఎన్‌టీయూ మీదుగా వెళ్లాలని ద్విచక్రవాహనంపై బయలు దేరారు. తాను వెళ్తున్న మార్గంలో ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించి వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. ఆ తర్వాత 108 అంబులెన్స్‌కూ సమాచారం అందించారు. అంబులెన్స్‌ వచ్చే వరకు అక్కడే ఉండి అందులోకి క్షతగాత్రుడిని ఎక్కించడంలోనూ సహాయం అందించారు. ఆ తర్వాత ఆసుపత్రికీ వెళ్లారు.

సమయస్ఫూర్తితో..

మరోవైపు ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్దిదూరంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఇస్లావత్‌ గోవింద్‌ కూడా సకాలంలో స్పందించారు. డయల్‌ 100 నుంచి ప్రమాదంపై ఆయనకు సమాచారం అందింది. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ స్థానిక పోలీసులకు సమాచారం అందించడమే కాకుండా ఆసుపత్రికి తరలించడంలో సహకారం అందించారు. వీరిద్దరి సమయస్ఫూర్తితో సాయిధరమ్‌ తేజ్‌ను సకాలంలో ఆసుపత్రికి తరలించగలిగారని పోలీసు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ..ACCIDENT: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని కాల్వలో పడ్డ కారు.. విద్యార్థి మృతి - ఏడుగురికి గాయాలు

Last Updated : Sep 12, 2021, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details