ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'బుగ్గనా.. పిట్ట కథలు వద్దు.. శ్వేతపత్రం విడుదల చేయండి​'

By

Published : Jul 14, 2021, 2:12 PM IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ను తెదేపా ఎమ్మెల్సీ అశోక్​ బాబు డిమాండ్​ చేశారు. వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులకు ప్రభుత్వానికి ఉన్న అప్పులు, బ్యాంకు గ్యారెంటీల వివరాలు వెల్లడించాలన్నారు.

TDP Ashokbabu
తెదేపా ఎమ్మెల్సీ అశోక్​ బాబు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పై ఆర్థిక మంత్రి బుగ్గన పిట్టకథలు మాని శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు చేసిన ఖర్చుతోపాటు మూలధన వ్యయం ఖర్చులు బహిర్గతం చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు ప్రభుత్వానికి ఉన్న అప్పులు, బ్యాంకు గ్యారెంటీల వివరాలు వెల్లడించాలని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ లెక్కలపై వాస్తవాలు చెప్పకుండా సీఎఫ్‌ఎంఎస్‌ విధానాన్ని తప్పుపట్టడం బుగ్గనకు తగదని హితవు పలికారు. మద్యం, ఇంధనం ద్వారా మునుపెన్నడూ లేనంత ఆదాయం రాష్ట్రానికి వస్తున్నా రెండేళ్లలో 1.70 లక్షల కోట్ల అప్పెందుకు చేశారని నిలదీశారు. రాజకీయ విమర్శలతో తెదేపాని, కట్టడి చేయగలరేమోగానీ.. కేంద్రప్రభుత్వాన్ని కాగ్‌కు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోలేరని అశోక్‌బాబు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details