ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆధారాలతో అరెస్టు చేస్తోంటే విమర్శలు ఏమిటి ?' - ప్రభుత్వ విప్ శ్రీకాంత్

అచ్చెన్నాయుడు అరెస్టుపై విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ విప్ శ్రీకాంత్ స్పందించారు. ఏసీబీ వంటి సంస్థలు ఆధారాలతో అరెస్టు చేస్తోంటే విమర్శలు చేయడం దేనికని ప్రశ్నించారు. ప్రజల సొమ్మను కాపాడేందుకే రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకువచ్చామని తెలిపారు.

Whip Srikanth, Accised the allegations of TDP leader Acchennaidu arrest
'ఆధారాలతో అరెస్టు చేస్తోంటే విమర్శలు ఏమిటి ?'

By

Published : Jun 13, 2020, 8:21 PM IST

ధైర్యం ఉంటే అరెస్టు చేయమన్న తెదేపా నేతలు.. ఆధారాలతో సహా ఏసీబీ అరెస్టు చేస్తుంటే విమర్శలు చేయడం ఏమిటని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల సొమ్ము తిన్నవారిని చంద్రబాబు నాయుడు వెనకేసుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాల్లో చంద్రబాబుకు తనను ఎప్పుడు పట్టుకుంటారోనన్న భయం వెంటాడుతోందని ధ్వజమెత్తారు. తుక్కు కొనుగోలు చేసి, బస్సులుగా మార్చి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నందున జేసీ ట్రావెల్స్ యజమానులు అరెస్టయ్యారని పేర్కొన్నారు. చట్టపరంగా పోలీసులు అరెస్టు చేస్తే కిడ్నాప్ అనటం ఏమిటని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని అంశాల్లోనూ ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details