ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాగల రెండు రోజుల్లో.. కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు - ap wheather report news

ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయ‌ల‌సీమ‌లో రాగల రెండు రోజులు తేలికపాటి వర్షాలు పడతాయని విశాఖ వాతవరణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసినట్లు వెల్లడించింది.

vishakha wheather report
విశాఖ వాతవరణం సమాచారం

By

Published : Apr 15, 2021, 5:26 PM IST

ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయ‌ల‌సీమ‌లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ విభాగం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు పడ్డాయని తెలిపింది.

వెంకటగిరిలో అత్యధికంగా 7 సెంటీమీటర్లు.. మదనపల్లె, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, గుర్రంకొండ‌, పోరుమామిళ్ల, జమ్మలమ‌డుగులో 5 సెంటీమీటర్ల చొప్పున వ‌ర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details