ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పేదవాడి ఆకలి తీర్చేందుకు ఏం చర్యలు తీసుకున్నారు' - సీఎం జగన్​పై దేవినేని ఉమ విమర్శలు

సీఎం జగన్​పై ట్విటర్​ వేదికగా దేవినేని ఉమ విమర్శలు సంధించారు. రాజప్రాసాదంలో ఉంటున్న ముఖ్యమంత్రి.. పేదవాళ్ల ఆకలి తీర్చడానికి తీసుకుంటున్న చర్యలేంటే చెప్పాలని ప్రశ్నించారు.

devineni uma
devineni uma

By

Published : Apr 29, 2020, 1:35 PM IST

దేవినేని ఉమ ట్వీట్

వైకాపా ప్రభుత్వానికి వలసకూలీలు, కార్మికులు, పేదవాడి ఆకలి పరుగులు కనిపించడం లేదా అని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ నిలదీశారు. మూడుపూటలా పేదవాడి ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్​లు రద్దు చేశారని మండిపడ్డారు. తాడేపల్లి రాజప్రాసాదంలో ఉంటున్న ముఖ్యమంత్రి పేదవాడి ఆకలి తీర్చడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటో రికార్డెడ్ ప్రెస్ మీట్ ద్వారానైనా చెప్పాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details