ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 8, 2021, 9:25 PM IST

ETV Bharat / city

సీపీఎస్​ను రద్దు చేస్తానన్న హామీ ఏమైంది?: అశోక్​బాబు

వారంలో సీపీఎస్​ను రద్దు చేస్తానన్న హామీ ఏమైందని... తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీజీపీఎఫ్ నిధుల్ని కూడా మళ్లించి ఉద్యోగుల పొట్టగొట్టారని ఆరోపించారు. ఉద్యోగులను బెదిరించిన పెద్దిరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

What is the guarantee that CPS will be abolished: Ashok Babu
What is the guarantee that CPS will be abolished: Ashok Babu

సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి ఉద్యోగులకు 2 నెలల వేతన బకాయిలను ప్రభుత్వం 6 శాతం వడ్డీతో చెల్లించాలని... ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీజీపీఎఫ్ నిధుల్ని కూడా మళ్లించి ఉద్యోగుల పొట్టగొట్టారని ఆరోపించారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు వచ్చే గ్రాట్యుటీ, పెన్షన్ సొమ్ము కోసం ఆరేడు నెలలు చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోందని మండిప్డడారు.

ప్రభుత్వ ఉద్యోగికి దక్కాల్సిన సరెండర్ సెలవుల సొమ్మును కూడా మింగేస్తున్నారని అశోక్​బాబు విమర్శించారు. వారంలో సీపీఎస్​ను రద్దు చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పీఆర్సీ, సీపీఎస్, ఎల్​టీసీలు, 6 డీఏల అంశాలను పెండింగ్​లో పెట్టినందుకు సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. వీటిపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ఉద్యోగులను బెదిరించిన పెద్దిరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details