ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

WEATHER ALERTS IN AP: రాష్ట్రానికి తుపాను ముప్పు..రేపటి నుంచి ఆ జిల్లాల్లో వర్షాలు - andhra pradesh weather news

Weather updates in andhra pradesh : అండమాన్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 4 నాటికి ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్​లో వర్షాలు

By

Published : Dec 2, 2021, 2:34 AM IST

Updated : Dec 2, 2021, 7:35 AM IST

Weather updates in andhra pradesh : అండమాన్‌ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ పశ్చిమ వాయువ్య దిశగా.... ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా కదులుతూ మరింత బలపడి వాయు గుండంగా మారే అవకాశం ఉంది. రేపటికి తుపానుగా బలపడి వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ 4 ఉదయం ఉత్తర ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో రేపటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచనలు జారీ చేసింది. రేపటి నుంచి మరో మూడు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లద్దని ఆదేశించింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను రైతులు కాపాడుకోవాలని కోరింది.

ఇవీచదవండి.

Last Updated : Dec 2, 2021, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details