రానున్న మూడు రోజుల వరకు రాష్ట్రానికి వర్షసూచన ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. రాయలసీమలో ఈరోజు, రేపు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని.. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రానున్న మూడు రోజుల వరకు రాష్ట్రానికి వర్షసూచన - అమరావతి వాతావరణ కేంద్రం వార్తలు
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.

రాష్ట్రానికి వర్షసూచన