దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. రెండ్రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశకు మళ్లే అవకాశం ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లోనూ రాష్ట్రంలోని అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వీటి ప్రభావంతో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
WEATHER ALERT: అల్పపీడన ప్రభావం.. రాగల మూడు రోజుల్లోనూ వర్షాలు - ఏపీలో వర్షాల తాజా సమాచారం
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లోనూ.. అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రధానంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ శాఖ
Last Updated : Sep 7, 2021, 7:12 PM IST