ఈశాన్య బంగాళాఖాతంలో శనివారంలోగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీనివలన రాబోయే 2, 3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు ఐఎండీ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో కడప జిల్లా ఆల్తూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో 2, విజయనగరం బూర్జలో 2, కర్నూలు జిల్లా నంద్యాలలో 1.6, కడప జిల్లా పెండ్లిమర్రిలో 1.4 సెంటిమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని 23 చోట్ల 1.5 సెంటిమీటర్ల లోపు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.