ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేశవ్యాప్తంగా మొదలైన నైరుతీ రుతుపవనాల నిష్క్రమణం - వాతావరణ నివేదిక

దేశవ్యాప్తంగా నైరుతీ రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి బిహార్ వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. దీని ప్రభావంతో మరో 2 రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

weather report
వాతావరణ నివేదిక

By

Published : Sep 28, 2020, 8:04 PM IST

దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. రాజస్థాన్, పంజాబ్​లలోని ప్రాంతాల పైనుంచి ఇవాళ నైరుతీ రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి బిహార్ వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది.

ఈ ప్రభావంతో రాగల 2 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రలోని విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని స్పష్టం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు

రేపల్లె - 4.4 సెంటిమీటర్లు, విజయనగరం -3.4 సెంటిమీటర్లు, రావికమతం- 3.2 మొవ్వ -3, అనకాపల్లి - 2.8, నాగాయలంక -2.4, రంపచోడవరం -2 తెర్లాం -1.9, నర్సీపట్నం -1.8, మచిలీపట్నం - 1.8, సారవకోట 1.4, నెల్లూరు -1.2, కనేకల్ -1.1, ఎమ్మిగనూరు - 1 సెంటిమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

విజయవాడ -35 డిగ్రీలు, విశాఖపట్నం - 35, తిరుపతి -34, అమరావతి -37, విజయనగరం -36, నెల్లూరు - 31, గుంటూరు -39, శ్రీకాకుళం - 35, కర్నూలు -31, ఒంగోలు -33, ఏలూరు -33, కడప - 33, రాజమహేంద్రవరం- 36, కాకినాడ -34, అనంతపురం -32 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది.

ఇవీ చదవండి:

విషాదం: కోతి దాడిలో వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details