రాష్ట్రంలో వానలు ముఖం చాటేశాయి. ఎండలు పెరిగాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5.8 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. సోమవారం రెండుచోట్ల 40 డిగ్రీలు దాటగా... అధికశాతం ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీలలోపు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో 41.1, గుంటూరు జిల్లా బాపట్లలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమతో పోలిస్తే.. కోస్తాలో అధిక ఉష్ణోగ్రతలున్నాయి.
WEATHER: ముఖం చాటేసిన వానలు.. ఠారెత్తిస్తున్న ఎండలు - ఏపీలో అధిక ఉష్ణ్రోగ్రత వార్తలు
వర్షాలు ముఖం చాటేశాయి. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇది రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. ఉష్ణ్రోగ్రతలు సాధారణం కంటే 5.8 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తూర్పుగోదావరిలో సోమవారం అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
జూన్ 1 నుంచి పరిశీలిస్తే...రాష్ట్రంలో సాధారణ వర్షపాతమే ఉంది. నెల్లూరులో 68.9%, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో 50% వరకు లోటు వర్షపాతం నమోదైంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ సాధారణం కంటే 32.4 నుంచి 47.7% వరకు తక్కువ వానలు కురిశాయి. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలుల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. అనంతపురంలో 81.2, కడపలో 76.8% చొప్పున అధిక వానలు కురిశాయి. జూన్ మొదటి పక్షంలో వర్షాల ప్రభావం అధికంగా ఉండగా.. తర్వాత నెమ్మదించాయి. పలుచోట్ల ఈదురుగాలులు హోరెత్తిస్తున్నాయి.
ఇదీ చదవండి:King Cobra: 14 అడుగుల కింగ్ కోబ్రా హల్ చల్