ప్రపంచం గర్వించే రాజధాని అమరావతి అని మాట తప్పిన మోదీని ప్రశ్నిస్తూ.. ఈ నెల 20న ఉద్దండరాయునిపాలెంలో కాంగ్రెస్ పార్టీ సదస్సు నిర్వహిస్తోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ తెలిపారు. అమరావతి పరిరక్షణ కాంగ్రెస్ కమిటీ.. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో పోరాడుతుందన్నారు. ప్రపంచం మొత్తం గర్వించే రాజధానిని చేస్తామన్న మోదీ... అమరావతి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని కాంగ్రెస్ ఖండిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ చేతిలో తోలుబొమ్మలా మారీ జగన్ ఏపీ ప్రజలను అవమానపరుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన చట్టంలోని అంశాలన్నీ సాధించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
'విభజన చట్టంలోని అంశాలన్నీ సాధించేందుకు కృషి చేస్తాం'
ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ తోలుబొమ్మలా మారారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలీ విమర్శించారు. దిల్లీలో రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. అమరావతి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే... ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ నెల 20న ఉద్దండరాయునిపాలెంలో కాంగ్రెస్ పార్టీ సదస్సు నిర్వహిస్తోందని చెప్పారు.
మస్తాన్మలీ