రాష్ట్రంలో త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని, ఇది ప్రభుత్వ విధానమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి తీరతామన్నారు. న్యాయస్థానంలో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే సీఎం పని చేయవచ్చన్న మంత్రి.. న్యాయస్థానంలో కేసులకు, సీఎం పని చేయడానికి సంబంధం లేదన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ విధానమని వ్యాఖ్యానించారు.
AP Executive Capital: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి తీరుతాం: మంత్రి బొత్స - Minister Botsa comments on Jagan
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి తీరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. 3 రాజధానులపై కొందరికి సందేహాలు ఎందుకో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా చేసి తీరుతామన్న బొత్స.. త్వరలో 3 రాజధానుల ఏర్పాటు జరుగుతుందని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే ప్రభుత్వ విధానమని.. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సీఎం పని చేయవచ్చని వ్యాఖ్యానించారు.

3 రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయించిన విషయాన్ని మంత్రి బొత్స గుర్తు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందన్నారు. రాజధానుల ఏర్పాటుపై రాజ్యాంగానికి అనుగుణంగానే చర్యలు తీసుకున్నామన్నారు. పేదలందరికీ ఇళ్లు ఉండాలని 30 లక్షలమంది మహిళలకు సీఎం ఇళ్ల స్థలాలు ఇచ్చారని, తొలిదశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపనన చేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తోన్న 17 వేల జగనన్న కాలనీల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఇదీ చదవండీ... Jagananna house: రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్