'ఒకప్పుడు రెండు వారాలకొకసారి నీళ్లు వచ్చేవి.. ఇప్పుడు రోజు తప్పించి రోజు వస్తున్నాయ్.. కరెంట్ కష్టం, తాగునీటి తండ్లాట పోయింది.. 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతిభద్రల సమస్య లేకుండా చేశాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయ్' అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు.
ఆరేళ్లలో కేంద్రం నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్‌కు రూపాయైనా కిషన్ రెడ్డి తీసుకొచ్చారా అని కేటీఆర్ నిలదీశారు. ఎందుకు భాజపాకు ఓటు వెయ్యాలో ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. గత ఆరేళ్లలో కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు కట్టామని.. రాష్ట్రానికి మాత్రం తిరిగి కేవలం రూ. 1.40 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. రూపాయి మనమిస్తే.. ఆఠానా మాత్రమే మనకిస్తున్నారని మండిపడ్డారు.