ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కొవిడ్ మరణాలు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం'

కొవిడ్ చికిత్సలో కీలకమైన రెమిడేసివర్ ఔషధం ఉత్పత్తిని రాష్ట్రంలోనే చేసేలా హెటిరో డ్రగ్స్​ను కోరినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు మూడో వారానికి 90 వేల డోసులు సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేసింది. ఏపీలో కోవిడ్ పరిక్షలకు రూ.5 కోట్లు, క్వారంటైన్ కేంద్రాల నిర్వహణకు రూ.1.5 కోట్లు ప్రతిరోజు ఖర్చు అవుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు.

We focus on reducing Kovid deaths
కొవిడ్ మరణాలు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం

By

Published : Jul 26, 2020, 3:20 AM IST

రాష్ట్రంలో కరోనా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ సోకిన రోగికి ఒక్కో డోసుకు 35వేల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. విజయవాడలోని ఆర్​అండ్​బి కార్యాలయంలో మరో మంత్రి బొత్సతో కలిసి కొవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కొవిడ్ మరణాలు తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులోలోకి తీసుకురావాలని సీఎం అదేశించారని తెలిపారు. వైద్యులు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఐఎంఏను సంప్రదిస్తున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పారా మెడికల్, శానిటేషన్ సిబ్బందిని కూడా నియమించనున్నట్టు మంత్రి వివరించారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను గణనీయంగా పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 139 కొవిడ్ ఆస్పత్రులు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,500 ఆక్సిజన్ సదుపాయం కలిగిన పడకలు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. అన్ని కొవిడ్ ఆస్పత్రులకు 15 వేల డోసులు అత్యవసర మందులు పంపుతున్నటు మంత్రి తెలిపారు.ఆగస్టు మూడో వారానికి దాదాపుగా 90వేలకుపైగా డోసులు కొవిడ్ హాస్పిటల్స్​లో అందుబాటులో ఉంచుతామన్నారు. హెటిరో నుంచి కొనుగోలు చేస్తున్న రెమిడిసివర్ ఔషధం రాష్ట్రంలోనే ఉత్పత్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.

ప్రస్తుత గణాంకాల ప్రకారం క్రిటికల్ కేర్ చికిత్స అవసరమైన రోగులు సంఖ్య పాజిటివ్ కేసుల్లో 7నుంచి 8%వరకు ఉంటుందని మంత్రి తెలిపారు. కొవిడ్ ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పన కోసం వచ్చే 6 నెలల్లో దాదాపు రూ.1000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్స్, కొవిడ్ సోకడానికి ఆస్కారం అధికంగా ఉన్న వారిపై దృష్టి సారించి పరీక్షలు చేస్తున్నామన్నారు. పెరుగుతున్న కేసులు దృష్ట్యా మరో 54 హాస్పిటల్స్ కొవిడ్ బాధితులు కోసం గుర్తించామన్నారు. క్వారంటైన్ సెంటర్స్​లో భోజనం, పారిశుధ్యం కూడా మెరుగ్గా ఉండాలని సీఎం అదేశాలు ఇచ్చారన్నారు. ప్రతిరోజు కొవిడ్ పరీక్షలు కోసం రూ.5కోట్లు, క్వారంటైన్ కేంద్రాల్లో భోజనం, పారిశుధ్యం కోసం రూ.1.5 కోట్లు ఖర్చు అవుతోందని వివరించారు.

ఇదీ చదవండీ... అమానుషం : కరోనా బాధితుల్ని ఇంట్లో పెట్టి తాళం వేసిన యజమాని

ABOUT THE AUTHOR

...view details