టోక్యో ఒలింపిక్స్‌లో పీసీ సింధు కాంస్య పతకం సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ కరోనా పరిస్థితుల్లోనూ ఒలంపిక్స్‌కు వెళ్లడం సాహసమేనన్నారు. వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడం మాములు విషయం కాదన్నారు. బంగారు పతకం విషయంలో నిరాశే ఎదురైనా కాంస్య పతక పోరులో సింధు చక్కటి ఆట తీరు కనబర్చడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రధాని మాటలూ సింధూలో ఎంతో స్ఫూర్తి నింపాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వచ్చాక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తుందని సింధు తల్లిదండ్రులు తెలిపారు.
PV SINDHU FAMILY: రెండోసారి పతకం.. ఎంతో ఆనందం: సింధు తల్లిదండ్రులు - tokyo Olympics news
ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్యం సాధించడంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి రెండుసార్లు వరుసగా పతకాలు తేవడం పట్ల గర్వంగా ఉందన్నారు. గత మ్యాచ్‌లో ఓడినా అందులోనుంచి బయటపడి విజయం సాధించడం గొప్ప విషయమన్నారు.
సింధు తల్లిదండ్రులు